శివ్వంపేట, వెలుగు: మండలంలోనిగోమారంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు దగ్గరకు వెళ్లి దేనికోసం దరఖాస్తు చేశావని అడిగారు.
దీనికి ఆమె బదులిస్తూ తన వేలి ముద్రలు పడక బియ్యం ఇస్తలేరని చెప్పింది. స్పందించిన ఎమ్మెల్యే సునీతరెడ్డి నర్సమ్మకు రేషన్ బియ్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.