మున్సిపాలిటీకి నిధుల కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే సునీత రెడ్డి

 మున్సిపాలిటీకి నిధుల కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే సునీత రెడ్డి

నర్సాపూర్, వెలుగు:  నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన కౌన్సిల్ జనరల్‌‌బాడీ మీటింగ్‌‌ నిర్వహించారు. సమావేశంలో వివిధ అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు.. తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. చీఫ్ గెస్ట్‌‌గా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీకి రావలసిన నిధుల విషయమై ఉన్నత అధికారులతో మాట్లాడుతానన్నారు.

 సమావేశంలో వైస్ చైర్మన్‌‌ నయిముద్దీన్, కౌన్సిలర్లు ఎర్రగొల్ల లత, ఇస్రాత్ సిద్దిక, యాదగిరి, సురేశ్, రామచందర్, సునీత, బుచ్చేశ్‌‌యాదవ్, రాజేందర్, లక్ష్మి, కమిషనర్ రామకృష్ణరావు పాల్గొన్నారుఅంతకుముందు నర్సాపూర్‌‌‌‌లో ప్యాక్స్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్యాక్స్‌‌ చైర్మన్ రాజుయాదవ్, చంద్ర గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, సత్యం గౌడ్ పాల్గొన్నారు.

దోడ్డు వడ్లకు, కందులకు, మక్కలకు..

శివ్వంపేట, వెలుగు: దొడ్డు వడ్లు, కందులు, మక్కలకు రూ.500 బోనస్​ ఇవ్వాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సోమవారం మండల పరిధి గోమారంలో  రామేశ్వరం చండి  రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించాలన్న ఆలోచనతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు.   మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సెంటర్​ నిర్వాహకులకు సూచించారు. రైతులకు గన్నీ బ్యాగులు, హమాలీ, లారీల కొరత లేకుండా చూడాలన్నారు.