రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి :  ఎమ్మెల్యే సునీతా రెడ్డి 

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి :  ఎమ్మెల్యే సునీతా రెడ్డి 

నర్సాపూర్ /హత్నూర, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని కాసాల దౌల్తాబాద్, దేవులపల్లి, హత్నూర, నవాబ్​పేట్,  సిరిపుర గ్రామాల్లో, నర్సాపూర్ మండలంలోని తుల్జారాంపేట్, గూడెం గడ్డ, చిన్నచింతకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్​శ్రీనివాస్, ఏబీఎన్ గౌరీశంకర్, మాజీ ఎంపీపీ నరసింహులు, గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, నరసింహారెడ్డి, రామ్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటేశ్, భాగయ్య, దుర్గయ్య, యాదయ్య పాల్గొన్నారు.