దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు :  ఎమ్మెల్యే సునీతారెడ్డి

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు :  ఎమ్మెల్యే సునీతారెడ్డి

కౌడిపల్లి, వెలుగు: దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని రాజిపేట్, వెంకట్రావుపేట్, నాగసాన్​ పల్లి, తిమ్మాపూర్, మహమ్మద్ నగర్, కౌడిపల్లి, వెల్మకన్న గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు.

సన్నవడ్లకు రూ.500 బోనస్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరారు. గతేడాదికి సంబంధించిన రూ.7 కోట్ల సన్నవడ్ల  బోనస్​ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మహమ్మద్ నగర్ సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్, శివ, మల్లేశ్ యాదవ్, రామాగౌడ్, వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా,  సొసైటీ సీఈవో దుర్గాగౌడ్,  ప్రవీణ్, కాంతారావు, ఎల్లం, భిక్షపతి పాల్గొన్నారు.
 
నర్సాపూర్/ హత్నూర :
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. హత్నూర మండలంలోని కాసాల, దౌల్తాబాద్, నస్తీపూర్, కొన్యాల, పన్యల తదితర గ్రామాలతో పాటు నర్సాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వడ్లు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.