కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలె : సుంకె రవిశంకర్

​ గంగాధర, వెలుగు: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను బొందపెట్టాలని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రజలను కోరారు. శనివారం గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి, సర్వారెడ్డిపల్లి, ముప్పిడి నర్సయ్యపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్​మధుకర్, పార్టీ మండలాధ్యక్షుడు నవీన్​రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.