ఏం అభివృద్ధి చేశావని ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చావా అంటూ గ్రామస్థులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై తిరగబడ్డారు. ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా తమ గ్రామానికి రాని ఎమ్మెల్యే ఇప్పడు ఎందుకు వచ్చడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ అభివృద్ధికి ఏం చేశావని అడిగితే ఎమ్మెల్యే అక్కడినుంచి సమాధానం చెప్పకుండా పారిపోయాడని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్ రావుపల్లి గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ ఎమ్మెల్యే ప్రసంగాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే వదిలేసి.. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
- ALSO READ | వివాదాస్పదంగా మారిన కవిత జగిత్యాల పర్యటన