సంక్షేమ పథకాలను వివరించాలి : సుంకె రవిశంకర్

గంగాధర, వెలుగు :  సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్​ కార్యకర్తలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మధురానగర్​లో  మండల ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని   గురువారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కథానాయకుడు కావాలని, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఈ సందర్భంగా  పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్​రావు, ఎంపీపీ శ్రీరాం మధుకర్, కొండగట్టు ఆలయ డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగన్న, ప్యాక్స్​చైర్మన్లు వెలిచాల తిర్మల్​రావు, దూలం బాలాగౌడ్​ను పార్టీ ఎన్నికల ఇన్​చార్జులుగా ప్రకటించారు 

చొప్పదండి, వెలుగు : ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కోరారు.  మండలంలోని గుమ్లాపూర్​, సాంబయ్యపల్లి, కాట్నపల్లి, కోనేరుపల్లి గ్రామాల్లో రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  బీఆర్ఎస్  మేనిఫెస్టో అన్నివర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ గడ్డం చుక్కారెడ్డి, ప్యాక్స్​ చైర్మన్​ వెల్మ మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్​రెడ్డి, సర్పంచులు, బీఆర్​ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.