కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు : సుంకె రవిశంకర్​

చొప్పదండి, గంగాధర, వెలుగు : తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. చొప్పదండి మండలం మండలం రాగంపేట గ్రామంలో ఆదివారం పల్లె దవఖాన ప్రారంభం, పలు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  సర్పంచ్​లత, ఎంపీపీ రవీందర్​, ఏఎంసీ చైర్మన్​ చుక్కారెడ్డి, ప్యాక్స్​చైర్మన్లు​ మల్లారెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు. 

ఓటీలతో 30 వేల ఎకరాలకు సాగునీరు 

మోతె రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు బదులుగా ఓటీల నిర్మాణంతో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్​లో వరదకాలువ వద్ద ఓటీల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్  రూ.255 కోట్లతో ఓటీ కాలువలు మంజూరు చేశారన్నారు. ఏఎంసీ చైర్మన్​ ఎల్లయ్య, లీడర్లు గంగాధర్​, మురళీకృష్ణారెడ్డి, వెంకట్‌‌‌‌రెడ్డి, కృష్ణారెడ్డి, జితేందర్​రెడ్డి పాల్గొన్నారు.