అవినీతిలో బీఆర్‌‌ఎస్‌‌ నంబర్‌‌ వన్‌‌ : సుశాంత్‌‌

మహదేవపూర్‌‌, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అవినీతిలో నంబర్‌‌ వన్‌‌ అని అసోం రాష్ట్రంలోని థౌరా ఎమ్మెల్యే సుశాంత్‌‌ విమర్శించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ మండలం కాళేశ్వరంలో గురువారం జరిగిన మహదేవపూర్‌‌, పలిమెల మండలాల శక్తి కేంద్ర, బూత్ లెవల్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలతో జరిగిన మీటింగ్‌‌లో ఆయన సుశాంత్‌‌ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో బీజేపీ గెలుపు కోసం కృషి  చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌‌ ఉద్యమకారులను పట్టించుకోకుండా డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసి, దేశం కోసం పనిచేసే బీజేపీని గెలిపించాలని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌ చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌‌బాబు ఒక్క హాస్పిటల్ గానీ, మెడికల్ కాలేజీ గానీ తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మంథని నియోజకవర్గంలో చందుపట్ల సునీల్‌‌ను గెలిపించాలని కోరారు. అంతకుముందు కాళేశ్వర ముక్తీశ్వర టెంపుల్‌‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పారు. అలాగే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్లకు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సునీల్‌‌, అసెంబ్లీ కన్వీనర్‌‌ మల్కా మోహన్‌‌రావు, మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ, కోయల్‌‌కార్‌‌ నిరంజన్‌‌, మండలాల ఇన్‌‌చార్జులు ఉడుముల విజయారెడ్డి, ఆకుల శ్రీధర్, ప్రోగ్రాం కన్వీనర్ ఎడ్ల సదాశివ్, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, బొల్లం కిషన్‌‌ పాల్గొన్నారు.

బీజేపీ జెండా ఎగురవేయాలి

కొత్తగూడ/మొగుళ్లపల్లి, వెలుగు : బీజేపీ ప్రవాస్‌‌ యోజనలో భాగంగా మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడలో ఒడిశా రాష్ట్ర ఎమ్మెల్యే నారాయణరావు, గోవా ఎమ్మెల్యే ఉల్లాస్‌‌ యశ్వంత్‌‌ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్‌‌ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కొత్తగూడలో జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌‌, అసెంబ్లీ కన్వీనర్‌‌ బలరాం, అధికార ప్రతినిధి తాటి కృష్ణ, మొగుళ్లపల్లిలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి సత్యపాల్‌‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్‌‌ రవీందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.