![చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్](https://static.v6velugu.com/uploads/2025/02/mla-talasani-srinivas-yadav-asks-not-to-trouble-small-traders_lYEwxqVLun.jpg)
పద్మారావునగర్, వెలుగు: ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం చేస్తున్నవారిని ఇబ్బంది పెట్టొద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్మారావునగర్‌లోని పార్క్ వద్ద రూ.12.50 లక్షలతో, వెంకటాపురం కాలనీలో రూ.42 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులు, రూ.3 లక్షలతో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని పార్క్ లో చేపట్టనున్న పనులను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి ప్రారంభించారు.
పద్మారావునగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ఇన్చార్జ్డా.కోట నీలిమ పాల్గొన్నారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ఫుట్పాత్వ్యాపారులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులను కోరారు.