
పద్మారావునగర్, వెలుగు: సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజనంతో పాటు చలివేంద్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తమ ట్రస్ట్ద్వారా 15 ఏళ్లుగా ఏటా వేసవిలో అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతల సహాయంతో నేటి నుంచి 2 నెలలపాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయన్నారు.
65 నుంచి 95 ఏళ్ల వయసున్న 170 మంది సభ్యులం సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ గా ఏర్పడి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దూబే, మాజీ అధ్యక్షుడు మాణిక్ రావ్ పాటిల్, సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.