భద్రాచలం, వెలుగు : మనుబోతుల చెరువు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డును భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం తనిఖీ చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తడిచెత్తతో బ్రిక్స్ తయారు చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నందున వాటి ఇన్స్టాలేషన్ను పరిశీలించారు.
భద్రాద్రి వాసులకు ఇక డంపింగ్ యార్డు సమస్య తొలగిపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. పంచాయతీ నుంచి వాహనాల్లో తడి, పొడి చెత్తలను వేరు చేసి వేయాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు కోరారు. ఈనెల 6న ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 10 టన్నుల తడి చెత్తతో ఇటుకలను తయారు చేస్తామని, వాటిని పొయ్యిలకు వాడుకోవచ్చని చెప్పారు.