ధాన్యం డబ్బులు ఇన్​టైంలో ఇవ్వాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు :  ఆదివాసీలకు ధాన్యం డబ్బులను సకాలంలో ఇచ్చేలా చూడాలని ఆఫీసర్లను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. దుమ్ముగూడెం మండలంలోని మహదేవపురం గ్రామంలో జీసీసీ(గిరిజన సహకార సంస్థ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సమయంలో కొర్రీలు పెట్టొద్దని సూచించారు. రైతులు కూడా ఆఫీసర్ల సూచనల మేరకు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు.