కాటమయ్య రక్షా కవచ్​ ట్రైనింగ్​ షురూ

కాటమయ్య రక్షా కవచ్​ ట్రైనింగ్​ షురూ

భద్రాచలం, వెలుగు :  దుమ్ముగూడెం మండలంలో బుధవారం గీత కార్మికుల కాటమయ్య రక్షా కవచ్​ ట్రైనింగ్​ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు షురూ చేశారు. తెలంగాణ సర్కారు ఐఐటీ నిపుణులతో తయారు చేయించిన  కాటమయ్య రక్షణ కవచం(మోకులు) సేఫ్టీ కిట్లను గీతకార్మికులకు అందజేశారు. 

వాటిని వినియోగించే తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్​, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ ద్వారా గీత కార్మికులకు వివరించారు. ఈ ప్రోగ్రాంలో జడ్పీటీసీ తెల్లం సీతమ్మ ఇతర నాయకులు పాల్గొన్నారు.