- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోని గిరిజన ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. భద్రాచలంలో గురువారం ఆయన నూతన ఫైరింజన్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ఏండ్ల కింద వచ్చిన ఫైరింజన్ పాతది కావడంతో తరుచూ రిపేర్లకు గురవుతోందన్నారు.
మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకు ప్రభుత్వం కొత్త ఫైరింజన్ కేటాయించిందని తెలిపారు. అనంతరం తెలంగాణ టూరిజం హరిత హోటల్లో టూరిస్టులను రామాలయానికి తీసుకెళ్లేందుకు మంజూరైన బ్యాటరీ వెహికల్స్ ను ఆయన ప్రారంభించారు.