భద్రాచలం,వెలుగు : దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఉచిత చేప పిల్లలను సోమవారం ఎంపీడీఓ ఆఫీసులో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. మొత్తం 8,15,700 చేప పిల్లలను 37 పంచాయతీల్లోని 120 చెరువులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి తియాజ్ మహ్మద్‌ఖాన్, ఎంపీడీవో ఈదయ్య, ఎంపీవో రామకృష్ణ, ఏవో రామనవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మండలంలోని కె.వీరభద్రాపురం, కేశవపట్నం గ్రామాల్లో పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. నీటి కాలువల్లో పూడిక ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పూడిక తీత, కాలువ వెడల్పుకు పనులు చేపట్టాలని వ్యవసాయశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేశారు. వసతులు, పిల్లల ఆరోగ్య పరిస్థితులు, వంటగది, తరగతి గదులను ఆయన పరిశీలించారు.