
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని పేషెంట్లకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఆయన అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు నవాబ్, బోగాల శ్రీనివాసరెడ్డి, సరెళ్ల నరేశ్, వెంకటేశ్, కోటేశ్తదితరులు పాల్గొన్నారు.