వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 10 మంది, వాజేడు మండలంలో 15 మంది లబ్ధిదారులకు భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై తిరుపతి, హరీశ్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటాపురం, వాజేడు తహసీల్దార్లు లక్ష్మీరాజ్యం, ప్రసాద్, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, విజయ తదితరులు పాల్గొన్నారు.