భద్రాచలం, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల డయాలసిస్ సదుపాయం అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సోమవారం ఆయన తనిఖీ చేశారు.
సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు వార్డుల్లో తిరుగుతూ రోగులతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ను గిరిజన దర్బారులో కలిసి నియోజకవర్గ సమస్యలపై
చర్చించారు.