అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి :  ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​ పొదెం వీరయ్య అన్నారు. దుమ్ముగూడెం మండలం బంగారుగూడెం, తూరుబాక గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై శనివారం వారు రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామాల్లో తిరిగి గ్రామస్తుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీటింగ్​లో ఆఫీసర్ల సమక్షంలో పరిష్కారానికి అవసరమైన అంశాలపై చర్చించారు. శాఖలవారీగా ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాల ప్రకారం చర్చ జరిపి ఎప్పటిలోగా పరిష్కరిస్తారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ పథకం ప్రజలకు చేరేలా ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మీటింగ్​లో తహసీల్దార్​అశోక్, ఎంపీడీవో ఈదయ్య, ఏఈ మోహన్​రెడ్డి, ఎంపీవో రామకృష్ణ, ఏవో నవీన్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

సర్వే సక్సెస్​కు కార్యకర్తలు కృషి చేయాలి

భద్రాద్రికొత్తగూడెం: సమగ్ర కుటుంబ సర్వే సక్సెస్​కు కాంగ్రెస్​ కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు, స్టేట్​ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పొదెం వీరయ్య అన్నారు. కొత్తగూడెంలోని కేసీవోఏ క్లబ్​లో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సర్వేతో ప్రజల సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయాలపై సమగ్రంగా నివేదికలను రూపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్​, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నాయకులు కొత్వాల శ్రీనివాస్​, నాగ సీతారాములు, తోట దేవీ ప్రసన్న. కే. చంద్రశేఖర్, బాల శౌరి, బిక్కసాని నాగేశ్వరరావు పాల్గొన్నారు.