కడియం కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కామెంట్స్ పై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. అత్మీయ సమావేశాలకు సీఎం కేసీఆర్...నియోజకవర్గాల వారిగా  ఎమ్మెల్సీను ఇన్ ఛార్జ్ లుగా నియమించారని అన్నారు. నల్గొండకు శ్రీహరికి బాధ్యతలు ఇవ్వడం వల్లే సమావేశాలకు పిలవలేదన్నారు. ఏప్రిల్ 4న స్టేషన్ ఘన్ పూర్ లో జరిగే అత్మీయ సమావేశానికి కడియం శ్రీహరిని అహ్వానిస్తున్నామని చెప్పారు. 

అంతకుముందు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు.  స్థానిక నాయకులతో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలువట్లేదంటూ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను ఉద్దేశించి కామెంట్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపుకు కృషిచేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని.. అయినా తనను పార్టీ సమావేశాలకు పిలువకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేశానని.. ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇకనైనా అందరిని కలుపుకుని పోవాలని, లేనట్లయితే పార్టీలో విభేదాలు వస్తాయని  ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

https://www.youtube.com/watch?v=b57XOj0zPeE

.