సోయా కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు : తోట లక్ష్మీకాంతారావు

సోయా కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు : తోట లక్ష్మీకాంతారావు
  • సోయా కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రికి వినతి

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లా మద్నూర్​, డొంగ్లీ మండలాల్లో  పూర్తి స్థాయిలో సోయా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం కేంద్ర వ్యవసాయ  శాఖ సహాయ మంత్రి భగీరథ్​ చౌదరి,  వ్యవసాయ శాఖ సెక్రెటరీ  దేవేశ్​ చతుర్వేదిలకు  జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వినతి పత్రం అందించారు.  రైతుల నుంచి పూర్తిస్థాయిలో  కొనుగోలు  చేయకుండానే  సెంటర్​ మూసి వేశారని, ఇంకా 8 వేల క్వింటాళ్ల వరకు సోయా ఉత్పత్తులు ఉన్నాయన్నారు.  

సోయా కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని  ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.   రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని,  ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు తాను విశ్రమించబోనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.