జుక్కల్​ సమగ్ర అభివృద్ధే లక్ష్యం : తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్​ సమగ్ర అభివృద్ధే లక్ష్యం : తోట లక్ష్మీకాంతరావు
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పిట్లం, వెలుగు: జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆదివారం బిచ్కుంద మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జుక్కల్​ను అభివృద్ధిలో ముందు ఉంచడం  కోసం పని చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మంజూరైన  సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం గ్రామానికి కొత్తగా మంజూరైన రేషన్​ దుకాణాన్ని ప్రారంభించి కల్యాణలక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. తొలుత మద్నూర్​ మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు
 పాల్గొన్నారు.