కరెంటు కష్టాలు తొలగించేందుకు రూ.46.48కోట్లు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

కరెంటు కష్టాలు తొలగించేందుకు రూ.46.48కోట్లు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కరెంట్  సమస్యలు తొలగనున్నాయని ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి అన్నారు.  రూ.46.48 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

స్తంభాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల షిఫ్టింగ్,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఫార్మర్ల మంజూరు, సబ్​ స్టేషన్ల  ఏర్పాటు, 33 కేవీ లైన్ ఏర్పాటు,11 కేవీ లైన్ లో షిఫ్టింగ్ లతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయనున్నారన్నారు.  నిధులు మంజూరు చేసిన సీఎం  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి  దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావులకు, నాగర్ కర్నూల్ ఎంపీ  మల్లు రవిలకు మేఘారెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.