
వనపర్తి, వెలుగుః నిబంధనల ప్రకారం వరి తేమ 14 శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే పెద్దమందడి, వనపర్తి మండలాల్లో 18 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా జిల్లా కలెక్టర్ వనపర్తి మండలంలోని అంకూరు,, వెంకటాపూరు, చిమన్ గుంట పల్లి, చిట్యాల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు సమకూర్చాలని కోరారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందని, క్యాలీపర్ మిషన్ ద్వారా ధాన్యం రకాన్ని గుర్తించి రైతులకు బిల్లులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సివిల్ సప్లై ఆఫీసర్ విశ్వనాథ్, తహసీల్దార్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.