వనపర్తి టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాద్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సీఎం కు న్యూఇయర్ విషెష్ చెప్పడంతో పాటు తిరుమల శ్రీ వారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే అందించారు.అనంతరం వనపర్తి నియోజక వర్గ అభివృద్ధికి తోడ్పాటునందించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం ప్రోగ్రాం వాయిదా...
వనపర్తి నియోజకవర్గంలో ఈ నెల 4న పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కార్యక్రమం వాయిదా పడినట్లు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు మంత్రివర్గ కీలక సమావేశం నిర్వహిస్తున్నందుకు పర్యటన రద్దు అయినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.