పెద్దమందడి/ఖిల్లాగణపురం, వెలుగు: గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పారిశుద్ధ్య సమస్య తీరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని వెల్టూరు గ్రామంలోని వీవర్స్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7 లక్షల జడ్పీ నిధులు మంజూరు చేశామని, పనులను క్వాలటీగా చేయాలని ఆదేశించారు.
అనంతరం గ్రామంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఖిల్లాగణపురం మండలం సల్కెలాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సాయిచరణ్‌రెడ్డి, వెంకటస్వామి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.