పెబ్బేరు, వెలుగు : ఇటీవల మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిలోని నీళ్లను విడుదల చేయాలని, రైతుబంధు, రైతు బీమా అందించాలని డిమాండ్ చేయడం సంతోషించే విషయమైనా కనీస అవగాహనతో మాట్లాడి ఉంటే బాగుండేదని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా నదిలో నీళ్లు లేవన్న విషయం తెలిసి ప్రతిపక్షంలో ఉన్నామని ఏదైనా మాట్లాడొచ్చనుకోవడం సరైంది కాదని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై పెబ్బేరు చౌరస్తాలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. శుక్రవారం పెబ్బేరు ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 114 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి
షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రంగాపూర్ గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని, మరో పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. హామీలు ఇచ్చి కాలయాపన చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదన్నారు. ప్రస్తుత మండల
మున్సిపాలిటీల్లోని ప్రజాప్రతినిధులకు తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అందరూ తనకు సమానమేనని చెప్పారు. ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో ప్రవీణ్, శ్రీనివాస్‌గౌడ్, విజయవర్దన్ రెడ్డి, వెంకట్రాములు, రాంచంద్రారెడ్డి, రంజిత్, యుగంధర్ రెడ్డి, వెంకటేశ్, రమణ పాల్గొన్నారు.