వనపర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవిని గెలిపించుకుంటే మల్లు రవి కేంద్ర మంత్రి అవుతారని, దీంతో వనపర్తి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ, కందకం, టౌన్‌చర్చి, 17వ వార్డుల్లో మార్నింగ్ వాక్ చేశారు. ఇంటింటికీ తిరిగి గ్యారంటీ పథకాల కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజలు బీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారని, బీజేపీకి ఓట్లేయమని చెబుతున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ఎన్నికల్లోనూ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తరువాత కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేశ్, వైస్ చైర్మన్ పి కృష్ణ, శంకర్ ప్రసాద్, సతీశ్, చీర్ల విజయచందర్, కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం, బ్రహ్మచారి, భువనేశ్వరి, చంద్రకళ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇదిలాఉంటే పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామానికి చెందిన 70 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, 80 మంది మార్కెట్ యార్డ్ హమాలీ సంఘం సభ్యులు పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.