సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాలిటెక్నిక్  కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని శుక్రవారం పరిశీలించి, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ మండలాల నేతలతో మాట్లాడి, జన సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.

అధికారులతో సమన్వయం చేస్తూ సీఎం సభను సక్సెస్​ చేయాలని కోరారు. సీఎం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, వనపర్తిలో చదువుకునే సమయంలో అద్దెకు ఉన్న  పార్వతమ్మ ఇంటిని సందర్శించి, ఆమెతో మాట్లాడతారని చెప్పారు.  ఎమ్మెల్యే వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు ఉన్నారు.