సేవాలాల్  జయంతిని ఘనంగా నిర్వహించాలి :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

సేవాలాల్  జయంతిని ఘనంగా నిర్వహించాలి :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్  సేవాలాల్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో సేవాలాల్  జయంతి వేడుకల నిర్వహణపై గిరిజన నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవాలాల్  జయంతిని పార్టీలకతీతంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు బాధ్యతలు తీసుకొని భక్తిశ్రద్ధలతో జయంతి నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్  జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జిల్లాకు రూ.2.68 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

కలెక్టర్  ఆదర్శ్  సురభి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. డీపీఆర్వో  పి. సీతారాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బా రెడ్డి, గిరిజన సంఘం నాయకులు శంకర్ నాయక్, చంద్రు నాయక్, వాల్య నాయక్, గోవింద్ నాయక్, రాధాకృష్ణ, ఆంజనేయులు, అర్జున్ నాయక్  పాల్గొన్నారు.