మక్తల్, వెలుగు : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్‌బ్యాంక్‌ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఫార్మసీని తనిఖీ చేసి, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీలు చేసేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్ వోను అదేశించారు. మక్తల్ కు కేటాయించిన అంబులెన్స్ ను జిల్లా ఆసుపత్రికి ఎందుకు పంపించారని నిలదీశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా అంబులెన్స్‌ను మక్తల్ కు కేటాయించాలన్నారు. డీఎంహెచ్‌వో సౌభాగ్య లక్ష్మి, బాలకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రవి కుమార్ , గణేశ్‌కుమార్ పాల్గొన్నారు.