మక్తల్​ను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలి : వాకిటి శ్రీహరి

మక్తల్​ను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలి : వాకిటి శ్రీహరి

నారాయణపేట, వెలుగు : మక్తల్​ను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గురువారం కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ రెవెన్యూ డివిజన్​కావడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. మక్తల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి సానుకూలంగా నివేదిక పంపాలని కలెక్టర్​ను కోరారు. 

వినతిపత్రం ఇచ్చినవారిలో బీజేపీ నాయకుడు కొండయ్య, మాస్​లైన్​ జిల్లా నాయకులు సలీం, కిరణ్, ఏఐపీకేఎస్​జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్​రెడ్డి, పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ తదితరులు ఉన్నారు.