మాగనూర్, వెలుగు : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఉమ్మడి మాగనూర్,కృష్ణ మండలాల్లో పర్యటించారు. తంగిడి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనానికి రూ. 20 లక్షల నిధులతో భూమి పూజ చేశారు.
అనంతరం రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. ప్రాథమిక పాఠశాల సందర్శించారు. ప్రోగ్రాంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్, నాయకులు శివరాం రెడ్డి, వాకిటి శ్రీనివాస్, నరసింహారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.