
తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అవన్ని ప్రతిపక్షాల ఆరోపణలేనని అని చెప్పారు. విరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలు అంటూ టీడీపీ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. అటు జగన్ రివ్యూ మీట్ కు గైర్హాజరు కావడంపై వంశీ స్పందించారు.
తాను ISB (Indian School of Business ) లో పరీక్షలు రాస్తున్నందున మీటింగ్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని పేర్కొన్నారు. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలను, ఎమ్మెల్యేలు కాదన్నారు. నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్ర దేనికి పనికి రాదంటూ వంశీ విమర్శలు చేశారు.