భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలో ప్రజలను వేధిస్తోన్న నీటి ఎద్దడిని నివారించడంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, ఆఫీసర్లు ఫెయిలయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కిన్నెరసాని మంచినీళ్లను వారం, పదిరోజులకోసారి ఇస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రతి రోజు నీళ్లు సరఫరా చేయడంలో ఫెయిలైన పాలకులు, ఆఫీసర్లు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీళ్ల పండుగ చేసుకోవడం సిగ్గు చేటన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు హామీలకే పరిమితమయ్యాయన్నారు. ప్రోగ్రాంలో లీడర్లు కోనేరు నాగేశ్వరరావు, హరిహరన్, జోగు ప్రదీప్ కుమార్, రవీంద్రనాథ్, రాజా, రవి, ఎస్.శంకర్పాల్గొన్నారు.