తన కొడుకు వనమా రాఘవేద్రరావు పై ఆరోపణలు వచ్చిన క్రమంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన కొత్తగూడెం నియోజక వర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను తీశాడు. ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది.
ఈ విషయమై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు వనమా రాఘవేద్రరావు ను పోలీసులకు అప్పగిస్తానని తేల్చి చెప్పారు. పోలీసులకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నానని కోరారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా నా కొడుకుని అప్పగిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం...