గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా : వనమా వెంకటేశ్వరరావు

పాల్వంచ,వెలుగు : తనను మరోసారి గెలిపిస్తే  మరింత అభివృద్ధి చేస్తానని కొత్తగూడెం  బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే ​ వనమా వెంకటేశ్వరరావు చెప్పారు.  సోమవారం మండలంలోని రంగాపురం నుంచి ప్రచారం ప్రారం భించారు. అంతకుముందు  పెద్దమ్మతల్లి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశానని భవిష్యత్తులో  మరింత చేస్తానని  హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశే ఖర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి,  రైతు బంధు కన్వీనర్​నాగేశ్వరరావు, జడ్పీటీసీ వాసు దేవరావు,  ఎంపీపీ  సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్  కనకేశ్, రాజు గౌడ్, శ్రీరామ్మూర్తి, విశ్వనాథం, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.