సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై నోరు పారేసుకుంటే ఖ‌‌‌‌బ‌‌‌‌డ్దార్ : వెడ్మ బొజ్జు సవాల్

ఆదిలాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే ఊరుకోబోమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నిక‌‌‌‌ల త‌‌‌‌ర్వాత సీఎం రేవంత్​ బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ నేతలు ప‌‌‌‌దేప‌‌‌‌దే తప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హిత‌‌‌‌వు ప‌‌‌‌లికారు. 

అధికారం కోల్పోవడం జీర్ణించుకోలేక‌‌‌‌ మాజీ మంత్రి కేటీఆర్​అస‌‌‌‌హ‌‌‌‌నంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ఉద్యమ ద్రోహుల‌‌‌‌ను పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టింది మీరు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ల దోస్తానా ప్రజలకు తెలుసని, కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. మిష‌‌‌‌న్ భ‌‌‌‌గీర‌‌‌‌థ పేరు మీద కోట్ల రూపాయ‌‌‌‌ల క‌‌‌‌మీష‌‌‌‌న్లు తీసుకున్నారని ఆరోపించారు. 

ఇప్పటికీ అనేక ఆదివాసీ గ్రామాల్లో తాగునీటి క‌‌‌‌ష్టాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం నీటి సమస్యకు ప‌‌‌‌రిష్కారం చూపింది నిజ‌‌‌‌మైతే తన ఎమ్మెల్యే ప‌‌‌‌ద‌‌‌‌వికి రాజీనామా చేస్తాన‌‌‌‌ని స‌‌‌‌వాల్ విసిరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్​రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, బొల్లారం బాబన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్​తదితరులు పాల్గొన్నారు.