షాద్ నగర్/పరిగి, వెలుగు: తేమ పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. షాద్ నగర్ పరిధిలోని చిలకమర్రి శివారులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే పరిగి మండలంలోని రంగంపల్లి, పూడూరు పరిధిలోని రాకంచెర్ల, చిట్టెంపల్లిలో కాటన్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్ల కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు జరగాలని, పత్తిలో తేమ శాతం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
కొడంగల్, వెలుగు: వికారాబాద్‌జిల్లా కొడంగల్‌లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మండలంలోని అప్పాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్చైర్మన్శివకుమార్, తహసీల్దార్విజయ్కుమార్, కొడంగల్ మార్కెట్‌కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్ కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సీజన్లో కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట మండలాల పరిధిలో 44,813 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలిపారు. 39 కేంద్రాల ద్వారా 11.65 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సన్నరకం ధాన్యం సేకరణకు అప్పాయిపల్లి, హస్నాబాద్, అంత్వార్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.