రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు : ప్రశాంత్ రెడ్డి

రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు : ప్రశాంత్ రెడ్డి
  • ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 

బాల్కొండ, వెలుగు:  వేల్పూరు మండల కేంద్రంలో  రూ. 2 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో లేనప్పటికీ కోరిన వెంటనే మంజూరు చేశారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

రూ.30 లక్షలతో ఇండోర్ స్టేడియం, రూ.1.20 కోట్ల ప్రైమరీ స్కూల్ బిల్డింగ్, రూ. 25 లక్షల జడ్పీ హైస్కూల్, ముదిరాజ్ సంఘం బిల్డింగ్ రూ.20 లక్షలు,చర్చి గ్రేవ్  యార్డ్ కాంపౌండ్ రూ.5లక్షలు, ముస్లిం అంజుమాన్ కమిటీ టాయిలెట్స్ కు రూ.2 లక్షలు మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.