బాల్కొండ, వెలుగు: భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా వేల్పూరులో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలో గురువారం తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ129వ జయంతిని ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. కొర్పోల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపించిన తెగువ మనందరికీ ఆదర్శమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. అర్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇందుప్రియా, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ సింధు శర్మ ఐలమ్మ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
సదాశివనగర్, వెలుగు: చాకలి ఐలమ్మ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సదాశివనగర్ మండల రజక సంఘం అధ్యక్షుడు తిమ్మజివాడి రాజన్న అన్నారు. గురువారం మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. నేటి యువత ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని, ఆమె చూపిన బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బీరయ్య, రజక సంఘం జిల్లా కార్యదర్శి చాకలి సంగయ్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దెల బాగయ్య, బీజేపీ నాయకులు బుడిగె నర్సింహారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్చారి, పెసరి సాయిలు, మంగలి సాయిలు, రాజన్న, ఆశన్న, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐల్లమ్మ 129 వ జయంతిని గురువారం నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఎల్లారెడ్డి రజక సంఘ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ రజకసంఘ గౌరవ అధ్యక్షుడు పర్వయ్య మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిందన్నారు. పండించిన పంటను కాపాడుకున్న తొలి మహిళ అని, ఆమె తిరుగుబాటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిందని తెలిపారు. చాకలి ఐల్లమ్మ జయంతి, వర్ధంతులు అధికారికంగా జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడం, కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, దాకాయి శేఖర్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, మహిళా కార్యదర్శి స్వరూప, నాగమణి, పద్మ, లక్ష్మణ్ , గోల్కొండ సిద్ధిరాములు, నాగరాజు, శివ, కళ్యాణ్ పాల్గొన్నారు.
కోటగిరి, వెలుగు: కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలాల రజక సంఘం అధ్యక్షుడ ప్యాట్ల పెంటయ్య ఆధ్వర్యంలో ఆమె విగ్రహానిక పూల మాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, మండల ఉపాధ్యక్షుడు శీను, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, వెలుగు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని రజక సంఘం అధ్యక్షుడు నాగేశ్, కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు బాకారం రవి అన్నారు. సిరికొండలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రమేశ్, లింగం, నవీన్, రాజలింగం, దేగం సాయన్న, మల్లేష్, ముత్తెన్న, గంగాధర్, రాజేంధర్, అశోక్, సంజీవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లో చాకలి ఐలమ్మ 129వ జయంతిని గురువారం నిర్వహించారు. దోభీఘాట్ శివారులో ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఓబీసీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ బాశెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం టౌన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబిసీ మోర్చా టౌన్ కార్యదర్శులు రెడ్డబోయిన దక్షిణ మూర్తి, బట్టు రాము, పోల మధు, చుక్క అనిల్ పాల్గొన్నారు.