ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య : వేముల వీరేశం

  •     నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను చేర్పించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. మండలంలోని మంగళపల్లిలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం బీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, ఎంఈవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు.