‘కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడబిడ్డలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం 

కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కట్టంగూర్ మండలానికి చెందిన112 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

నార్కట్​పల్లి వెలుగు : శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

చిట్యాల, వెలుగు : చిట్యాల పట్టణంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.