
కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ఉషోదయ లేజర్ కంటి ఆస్పత్రి కేర్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.