- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, వెలుగు : గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణానికి చెందిన రివర్ నిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్థానిక జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలకు వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు హెల్త్ క్యాంపులతో మేలు జరుగుతుందన్నారు.
శిబిరంలో డాక్టర్లు వందల మందికి పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత అంజద్ షరీఫ్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంబయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ యాసారపు లక్ష్మీ వెంకన్న, నేతలు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గుణగంటి రాజు పాల్గొన్నారు.