నల్లగొండ: ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు స్వాగతం చెప్పేందుకు హెలి ప్యాడ్ వద్దకు వెళ్తుండగా వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలత చెందిన వేముల పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. మినిస్టర్లకు వెల్ కమ్ చెప్పకుండానే అలిగి అక్కడి నుండి వెనుదిరిగారు.
ALSO READ : అమీన్‌పూర్‌లో హైడ్రా పేరుతో బిల్డర్లకు బెదిరింపులు.. బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్
ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పోలీసులు గుర్తు పట్టకుండా అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తనకు జరిగిన ఈ అవమానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని వేముల డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి దళిత ఎమ్మెల్యేలు ఈ ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. కాగా, ఈ ప్రోటోకాల్ ఇష్యూపై ఆ రోజే వేముల స్పందిస్తూ.. ఆకలినైనా సహిస్తా.. కానీ అవమానాన్ని భరించనని.. తనకు జరిగిన అవమానం స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.