పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే వేముల వీరేశం 

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్​ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, మండల ప్రత్యేకాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, మున్సిపల్ చైర్మన్ రజితాశ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ రావు, నాయకులు పాల్గొన్నారు.