నార్కట్పల్లి, వెలుగు: రైతు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలంలోని చౌడంపల్లి వరలక్ష్మి కాటన్ మిల్లు,చిట్యాల మండలంలోని ఆరెగూడెం,పెద్దకాపర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు .
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గుత్త అమిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు భత్తుల ఉషయ్య గౌడ్, బండ సాగర్ రెడ్డి, సట్టు సత్తయ్య, దూదిమెట్ల సత్తయ్య, వడ్డే భూపాల్ రెడ్డి,పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భారత్, సత్తి తదితరులు పాల్గొన్నారు.