నకిరేకల్, వెలుగు : శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో నిర్వహించనున్న శివాంజనేయ ఆలయం నిర్మాణానికి సహకరిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఊట్కూరు గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఊరిలో గుడి, బడి నిర్మించి ఆధ్యాత్మికత, విజ్ఞానాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో సన్మానించారు.